కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ… ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆర్డీటీ స్వచ్చంద సంస్థ సిబ్బంది కళాజాత రూపంలో ప్రదర్శనలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం పరిధిలోని వివిధ గ్రామాలు, కూడళ్లలో.. పోలీసులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రజలంతా మరింత కాలం భౌతిక దూరం పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందవచ్చని చెబుతున్నారు. అధికారులు, వైద్యుల సూచనలు పాటిస్తూ… కరోనాపై విజయం సాధిద్ధామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
రోజుకు 80 టన్నుల ఆక్సిజన్ ఇప్పించండి.. ప్రధానికి సీఎం జగన్ లేఖ