అనంతపురం జిల్లా ధర్మవరంలో అధికారులు కరోనా వైరస్‌పై వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. యముడు, చిత్రగుప్తుడు, కరోనా యమదూతల వేషధారణతో పట్టణంలోని ప్రధాన రాహదారులపై తిరగుతూ కరోనా వల్ల కలిగే ప్రాణనష్టం గురించి వివరించారు.
సామాజిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం అలవర్చుకుంటే మీ జోలికి రాను అని లేకుంటే యమపాశం తప్పదని యమ ధర్మరాజు హెచ్చరించారు.
ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆర్డీఓ తెలిపారు.
ఇదీ చూడండి:'కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం'