అనంతపురం జిల్లా మడకశిర మండలం వై.బి. హళ్ళి గ్రామస్థులు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఇంటి స్థలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించరాదని ఆందోళన చేపట్టారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. వై.యస్. రాజశేఖర్రెడ్డి హయాంలో 26 కుటుంబాలకు పట్టాలు మంజూరు చేసారన్నారు. ప్రస్తుతం ఆ స్థలంలో ఇండ్లు పూర్తి నిర్మాణం అయి ఉన్నాయని, పునాది బిల్లులు మంజూరు అయ్యాయని తెలిపారు. అధికారులు ఆ స్థలాల్లో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు. గ్రామపంచాయతీలో తీర్మానం చేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. . ఇలా చేస్తే 26 కుటుంబాలు నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు ప్రజలకు అనుకూలంగా ఉన్న వేరే చోట ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని బాధితులు కోరారు.
ఇవీ చూడండి...