ETV Bharat / state

ఆటో డ్రైవర్​కు ఫిట్స్.. హోటల్​లోకి దూసుకెళ్లిన వాహనం

author img

By

Published : Nov 4, 2020, 3:45 PM IST

ఆటో నడుపుతున్న డ్రైవర్​కు అనుకోకుండా ఫిట్స్ వచ్చింది. అనంతపురంలోని రహమత్​నగర్​లోని హోటల్​లోకి వాహనం దూసుకువెళ్లింది. చిన్న చిన్న సామగ్రితో పాటు ఆటో ధ్వంసం కాగా.. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

auto accident in anantapuram
ప్రమాదానికి కారణమైన ఆటో

అనంతపురంలోని రహమత్​నగర్​లో రోడ్డు పక్కనున్న ఓ హోటల్​లోకి ఆటో దూసుకెళ్లింది. ప్రాణనష్టం తప్పినా.. వాహనం ముందు భాగంతో పాటు చిన్న, చిన్న సామగ్రి ధ్వంసమైంది. డ్రైవర్​కు ఫిట్స్ రావడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అతడిని ఆస్పత్రికి తరలించగా.. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అనారోగ్య సమయాల్లో వాహనాలు నడపి.. ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని పోలీసులు హెచ్చరించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా.. వాహన చోదకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: అనంతలో యువతి కిడ్నాప్​.. అసలు సంగతేంటంటే...?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.