అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గొల్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా రైతులు తీవ్రంగా గాయపడ్డారు. గొల్లపల్లికి చెందిన 10 మంది మహిళా రైతులు మల్కాపురంలో నిర్వహించిన రైతు క్షేత్రం అవగాహన కార్యక్రమానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఉండగా.. రహదారిపై ఆటో అదుపు తప్పింది.
వెనకవైపు కూర్చున్న ముగ్గురు మహిళా రైతులు కింద పడ్డారు. నాగేంద్రమ్మ, చంద్రకళ, కళావతిగా వారిని గుర్తించారు. ముగ్గురికీ తల భాగంలో గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
ఇదీ చూడండి: