ETV Bharat / state

గుత్తి కొండగుట్టల్లో నాటుసారా స్థావరాలపై దాడులు

author img

By

Published : May 17, 2020, 1:47 PM IST

అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కలచెరువు గ్రామ సమీపంలోని కొండ గుట్టల్లో నాటు సారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు.

Attacks on Natusara settlements in Guthi Kondagullalu
గుత్తి కొండగుట్టల్లో నాటుసారా స్థావరాలపై దాడులు

అనంతపురం జిల్లాలో ఎస్పీ ఆదేశాల దాడులు నిర్వహిస్తున్నట్లు గుత్తి సీఐ రాజశేఖర్​రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే గుత్తి మండలం జక్కలచెరువు గ్రామ సమీపంలోని కొండ గుట్టల్లో సారా తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో తనిఖీలు చేశామన్నారు. ఈ సోదాల్లో సుమారు 2000 లీటర్ల నాటుసారా బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు వివరించారు. 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా సారా అక్రమంగా నిలువ ఉంచినా, తయారు చేసినా, అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: చిరుత మృతి.. దర్యాప్తు చేస్తున్న అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.