రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అనంతపురంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు నిరసన చేపట్టారు. అమరావతి ఉద్యమం 200 రోజులకు చేరిన సందర్భంగా అనంతపురంలో విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
వైకాపా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే అమరావతినే రాజధానిగా కొనసాగించి... ఆగిన నిర్మాణాలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి కార్యాలయాల చుట్టూ చీనీ రైతుల ప్రదక్షిణ