సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లాకు వస్తుండటంతో జిల్లాలో ఉన్న పరిస్థితిని వివరించాలని సీపీఎం నాయకులు భావించారు. అనంతపురంలోని ఆర్.అండ్.బి అతిథి గృహం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.
జిల్లాలో ఎప్పుడో ప్రారంభం కావాల్సిన సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి నేటికీ అందుబాటులోకి రాలేదని విమర్శించారు. వైద్యశాల అందుబాటులో ఉండి ఉంటే 180 మంది బాధితులకు ఆక్సిజన్ సౌకర్యంతో బెడ్లు ఉండేవని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ అన్నారు. కరోనా సాకుగా చూపి ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిని కొవిడ్ ఆసుపత్రిగా మారిస్తే.. సామాన్య రోగులు ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. క్వారంటైన్లో నాణ్యమైన భోజనం అందించకుండా కాంట్రాక్టర్లు మోసం చేస్తున్నా.. ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహించారు. ఇవన్నీ మంత్రికి వివరించడానికి వస్తే అరెస్టులు చేస్తారా అని మండిపడ్డారు.
ఇవీ చదవండి: కరోనా పరిస్థితులపై వైద్యారోగ్యశాఖ మంత్రికే తప్పుడు నివేదికలు