అనంతపురం జిల్లా కనేకల్ మండలం ఎర్రగుంట్ల గ్రామం వద్ద వేగంగా వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు... స్టీరింగ్ పనిచేయని కారణంగా అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న కేబుల్ గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కర్ణాటకలోని బళ్లారి నుంచి కనేకల్ మీదుగా కళ్యాణదుర్గం వెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. ప్రమాదం సమయంలో బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ బస్సు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం డిపోకు చెందినదిగా గుర్తించారు. ఏపీఎస్ఆర్టీసీ అధికారులు, కనేకల్ పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. బస్సులోని ప్రయాణికులను మరొక బస్సులో గమ్యస్థానాలకు పంపించారు.
ఇవి చదవండి...బొగ్గు లారీ బోల్తా.. డ్రైవర్ సురక్షితం