రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్దికి ఏమి చేసిందో స్పష్టం చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రశ్నించారు. అనంతపురం నగరంలో భాజపా అభ్యర్థుల తరుపున ప్రచారానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛ భారత్, అమృత్, జాతీయ ఉపాధి హామీ పథకాలు వంటి ఆరు అంశాలకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులిస్తుంటే ఎక్కడా చెప్పటం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి చేస్తున్నదేమిటన్న దానిపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థలను బలోపేతం చేయటంతోనే దేశం బలోపేతం అవుతుందని నమ్మిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని సోము వీర్రాజు అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై తమ పార్టీకి ఓ స్పష్టత ఉందని, అందువల్లే తాము దిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసి వివరించామన్నారు.
ఇదీ చదవండి