ETV Bharat / state

మద్యం మత్తులో గతి తప్పిన లారీ డ్రైవర్.. కదిరిలో అరగంట పాటు బీభత్సం - undefined

మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్.. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో బీభత్సాన్ని సృష్టించాడు. మదనపల్లి నుంచి వస్తూ.. పోలీసులను చూసి భయపడి వాహనాన్ని దారి మళ్లించాడు. ఈ క్రమంలో.. అరగంట పాటు పట్టణ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేశాడు. ఎవరికీ ప్రాణాపాయం కలగకుండా.. స్థానికులు, పోలీసులు అప్రమత్తమై అతన్ని పట్టుకున్నారు.

lorry accident
lorry accident
author img

By

Published : Jul 26, 2021, 8:44 AM IST

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో సిమెంటు లారీ బీభత్సం సృష్టించింది. మదనపల్లి నుంచి పులివెందుల వైపు 42వ నంబర్ జాతీయ రహదారిపై వెళుతున్న లారీ.. కదిరి పట్టణ శివారు ప్రాంతం నుంచి అతి వేగంగా దూసుకొచ్చి.. వాహనచోదకులు, పాదచారులను పరుగులు పెట్టించింది. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో కదిరి పట్టణంలోకి సదరు లారీ ప్రవేశించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్... నిరాటంకంగా హారన్ కొడుతూ అతి వేగంగా దూసుకొచ్చాడు.

ధ్వంసమైన ద్విచక్రవాహనాలు
ధ్వంసమైన ద్విచక్రవాహనాలు

గుర్తించిన స్థానికులు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు పెట్టారు. మరి కొందరు యువకులు లారీ వెంటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు లారీని వెంబడించారు. మదనపల్లి వైపు నుంచి పులివెందులకు వెళ్లాల్సిన లారీని డ్రైవరు కదిరిలోని ఇందిరా గాంధీ కూడలి నుంచి హిందూపురం వైపు మళ్ళించాడు. వేగంలో వాహనాన్ని అదుపు చేయలేక రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టాడు. ప్రమాదం ధాటికి స్తంభం విరిగి నేలవాలింది.

లారీ ఢీ కొని నేలవాలిన విద్యుత్ స్తంభం
లారీ ఢీ కొని నేలవాలిన విద్యుత్ స్తంభం

అదే స్తంభానికి ఆనుకుని ఉన్న మూడు ద్విచక్ర వాహనాలపై లారీ దూసుకుపోగా.. అవి పూర్తిగా దెబ్బతిన్నాయి. హిందూపురం వైపు తీసుకువెళ్లాల్సిన లారీని.. పోలీసులను చూసిన డ్రైవరు తేరు బజారు మీదుగా మహాత్మా గాంధీ రోడ్డు వైపు మళ్ళించాడని పోలీసులు చెప్పారు. చివరికి... తమతోపాటు స్థానికులు చుట్టుముట్టగా.. పేరు సమీపంలో వాహనాన్ని నిలిపి పారిపోయేందుకు ప్రయత్నించాడన్నారు. స్థానికులు లారీ డ్రైవర్ ను పట్టుకున్నారని.. అతన్ని అరెస్ట్ చేశామని చెప్పారు.

ఇదీ చదవండి:

Thunder effect: పిడుగు భయం.. గతంతో పోలిస్తే 34% అధికం!

For All Latest Updates

TAGGED:

AV
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.