అనంతపురం జిల్లా ధర్మవరం రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జీఎం మాల్యా తనిఖీ చేశారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో వచ్చిన ఆయన మొదట కల్లూరు నుంచి ధర్మవరం వరకు జరుగుతున్న రైల్వే డబ్లింగ్ పనులను తనిఖీ చేశారు. రైల్వే ఉన్నతాధికారులతో కలసి పనులను పరిశీలించారు. కల్లూరు నుంచి ధర్మవరానికి చేస్తున్న డబ్లింగ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. పనులు పూర్తయితే రైళ్ల రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందన్నారు.
ఇవీ చదవండి