అనంతపురం జిల్లా తాడిపత్రిలో గంజాయి ముఠా గట్టు రట్టు చేశారు.. పోలీసులు. పట్టణంలో గంజాయి విక్రయ కేంద్రంపై దాడి చేసి ఖాజా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 700 గ్రాముల గంజాయి సంచులు, రూ.27,450 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని గాంధీ కట్ట సమీపంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లుగా సమాచారం వచ్చిందని డీఎస్పీ జయరామ సుబ్బా రెడ్డి తెలిపారు. సిబ్బందితో కలిసి దాడులు చేయగా మునీర్, శేక్షావళి, సైదు అనే ముగ్గురు పరారయ్యారన్నారు. ఖాజా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి గంజాయి, నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీరంతా విజయవాడ నుంచి గంజాయి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయాలు చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు. గతంలో వీరిపై మూడు గంజాయి కేసులు, నాలుగు మట్కా కేసులు ఉన్నాయన్నారు. నలుగురిపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు.
ఇవీ చదవండి....