అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథం ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కదిరి భాజపా, జనసేన, రాష్ట్రీయ స్వయం సేవక్ , భజరంగ్ దళ్ ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టాయి. విశ్వహిందూ పరిషత్ నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.
రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు కొనసాగుతున్నాయని వాటిని అరికట్టే హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. అంతర్వేది ఆలయంలో జరిగిన దుర్ఘటన కుట్ర కోణాన్ని చేధించాలని హిందువుల మనోభావాలను కాపాడాలని నిరసన తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో పాల్గొన్న నాయకులను అరెస్టు చేయడం భావ్యం కాదని వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో, తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి: