కరోనా నివారణ వ్యాక్సిన్ వేయించుకున్న ఉమాదేవి అనే అంగన్వాడి కార్యకర్త అస్వస్థతకు గురయ్యారు. ధర్మవరం మండలం పోతుకుంట అంగన్వాడి కేంద్రంలో పనిచేస్తున్న ఆమె... అక్కడి ఐసీడీఎస్ కార్యాలయంలో వ్యాక్సిన్ వేయించుకుంది.
కాసేపటికి కళ్లు తిరిగి పడిపోయింది. వైద్యుడు చెన్నారెడ్డి బృందం ఆమెను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రసుత్తం ఉమాదేవి పరిస్థితి నిలకడగా ఉండగా.. చికిత్స కొనసాగుతోంది.
ఇదీ చదవండి: