ETV Bharat / state

8 పెట్టెల్లో 2.4 కిలోల బంగారం, 84 కిలోల వెండి, రూ.15.55 లక్షలు - అనంతపురం జిల్లాలో ట్రంకు పెట్టె

anathapuram trunk
ఖజానా శాఖ ఉద్యోగి మనోజ్‌ ఆస్తులను నిగ్గుతేల్చిన పోలీసులు
author img

By

Published : Aug 19, 2020, 9:40 AM IST

Updated : Aug 19, 2020, 1:19 PM IST

09:37 August 19

ఖజానా శాఖ ఉద్యోగి మనోజ్‌ ఆస్తులను నిగ్గుతేల్చిన పోలీసులు

ఖజానా శాఖ ఉద్యోగి మనోజ్‌ ఆస్తులను నిగ్గుతేల్చిన పోలీసులు

 అనంతపురం జిల్లాలో ట్రంకు పెట్టెల్లో నిధులు దాచిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఓ ఇంట్లో ఆయుధాలు దాచిపెట్టారనే సమాచారంతో తనిఖీలకు వెళ్లిన పోలీసులకు... 8 పెట్టెల్లో 2.4 కిలోల బంగారం, 84 కిలోల వెండి, రూ.15.55 లక్షలు  లభించటం కలకలం రేపుతోంది. అవన్నీ జిల్లా కేంద్రంలోని ట్రెజరీ ఉద్యోగి మనోజ్‌కు చెందినవిగా ప్రాథమిక విచారణలో పోలీసులు నిర్ధరించారు. ముగ్గురు డీఎస్పీలు, రెవెన్యూ అధికారుల సమక్షంలో తనిఖీలు జరిపి మరిన్ని ఆధారాలు సేకరించారు.  

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం ఎస్సీ కాలనీలోని  నాగలింగ  ఇంట్లో ఆయుధాలు ఉన్నాయని సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసులుకు  వచ్చిన సమాచారం  మేరకు  సోదాలు జరిపారు. డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసులు, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆఇంట్లో తనిఖీలు చేశారు. అక్కడ పోలీసులే విస్తుపోయేలా భారీ మొత్తంలో నిధులు బయటపడ్డాయి. నాగలింగ  ఇంట్లో సోదాలు జరిపిన పోలీసులకు 8 ట్రంకు పెట్టెలు లభించాయి. వాటిని తెరుస్తున్న కొద్దీ బంగారం, వెండి, నగదు బయటపడ్డాయి .

తహసీల్దార్‌ సమక్షంలో పెట్టెలన్నీ తెరిచి అందులోని నిధుల్ని లెక్కించారు. ఓ తుపాకినీ స్వాధీనం చేసుకున్నారు .బాలప్ప అల్లుడు నాగలింగ  పని చేసే యజమాని పేరు మనోజ్..అతనే ఈ పెట్టెలు అక్కడికి తీసుకెళ్లిన్నట్లు తేలింది. మనోజ్ అనంతపురంలోని ట్రెజరీలో పని చేస్తున్నట్లు ఏఎస్పీ రామకృష్ణ తెలిపారు.  8 పెట్టెల్లో 2.4 కిలోల బంగారం, 84 కిలోల వెండి, రూ.15.55 లక్షలు గుర్తించారు. రూ.27 లక్షలు విలువైన ప్రామిసరీ నోట్లు, రూ.49 లక్షల బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు దొరికాయి. 6 బైక్‌లు, 3 రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్లు,  రూ.లక్షల విలువైన మరో ద్విచక్రవాహనం4 ట్రాక్టర్లు, 2 అత్యాధునిక  కార్లు గుర్తించారు.  ఎసీబీ, ఇన్ కమ్ ట్యాక్స్ వారికి కూడా సమాచారం అందించామని చెప్పారు. 

ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు  ఏఎస్పీ రామకృష్ణ తెలిపారు. మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు. దర్యాప్తులో వచ్చిన అంశాల ఆధారంగా నివేదిక తయారుచేస్తామని వెల్లడించారు. ఈ ఆస్తులన్నీ మనోజ్‌, ఆయన తల్లి, డ్రైవర్‌ పేరుపై ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. 

ఇదీ చూడండి. 

 ఇంట్లోని ట్రంకు పెట్టెల్లో బంగారం, వెండి నిల్వలు..

Last Updated : Aug 19, 2020, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.