అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ జేడీఏ హబీబ్ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలపై అతనిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పనిచేసే ఓ మహిళా ఉద్యోగి డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు అభ్యర్థించగా.. వేధింపులకు గురి చేశారని ఆ మహిళ ఆరోపించారు.
అలాగే పలువురు మహిళా ఉద్యోగులు హబీబ్ బాషాపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ప్రాథమిక విచారణ అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. త్వరలో కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
ఇవీ చదవండి...