అనంతపురంలో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ప్రకాశ్‌పై పలు కేసులు ఉన్న కారణంగానే... వాటి నుంచి తప్పించుకోవాలని భావించినందునే ఇలాంటి చర్యకు దిగాడని డీఎస్పీ వీరరాఘవరెడ్డి తెలిపారు. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లికి చెందిన ప్రకాశ్ అనే వ్యక్తి.. 20 ఏళ్లుగా ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఆయన విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాక.. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని డీఎస్పీ తెలిపారు. అనంతపురం ఏఆర్ విభాగం రిజర్వ్ ఇన్స్పెక్టర్ శేఖర్ ఇంట్లో పేలుడు పదార్థాలు ఉంచి హత్యాయత్నం చేయడం, ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు యత్నించడం, పలువురిపై దాడి, బెదిరింపులకు దిగడం, ఒక మహిళను మోసం చేసిన కేసులు ఆయనపై ఉన్నట్లు చెప్పారు. విధి నిర్వహణలో ఇబ్బందులు ఉన్నాయని సంబంధిత అధికారులను ఎప్పుడూ కలవలేదన్నారు. ఈ నేపథ్యంలో వీటన్నింటి నుంచి తప్పుంచుకునేందుకే ఆత్మహత్యాయత్నం చేశాడని చెప్పారు. కానిస్టేబుల్ ప్రకాశ్ ఆరోపిస్తున్నట్లుగా ఏ అధికారి వేధింపులకు పాల్పడలేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: