ETV Bharat / state

ఓబుళాపురం సమీపంలో ఇనుప ఖనిజ తవ్వకాలకు టెండర్లు - గనుల తవ్వకాలు

ఓబుళాపురం సమీపంలో ఇనుప ఖనిజం తవ్వకాలకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) సిద్ధమైంది. అనంతపురం జిల్లా డి.హీరేహళ్‌ మండలం హెచ్‌.సిద్ధాపురంలో 25 హెక్టార్లలో తవ్వకాలకు టెండర్లు పిలిచింది.

obulapuram
ఓబుళాపురం మైనింగ్​
author img

By

Published : Jul 9, 2021, 7:53 AM IST

ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక సరిహద్దులోని ఓబుళాపురం సమీపంలో ఇనుప ఖనిజం తవ్వకాలకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) సిద్ధమైంది. ఓవైపు అక్కడ సరిహద్దు ఖరారుపై వివాదం నడుస్తుండగానే.. రాష్ట్ర పరిధిలోని అనంతపురం జిల్లా డి.హీరేహళ్‌ మండలం హెచ్‌.సిద్ధాపురంలో 25 హెక్టార్లలో తవ్వకాలకు టెండర్లు పిలిచింది. పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్న ఈ లీజును కొన్నేళ్ల కిందట ఏపీఎండీసీకి రిజర్వ్‌ చేశారు. తాజాగా ఇందులో ఖనిజం తవ్వి, విక్రయించుకునేందుకు మైన్‌ డెవలపర్‌ అండ్‌ ఆపరేటర్‌ కోసం టెండరు పిలిచారు. ఈ లీజు ప్రాంతంలో 4 మిలియన్‌ టన్నుల నిల్వలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇందులో 2.5 మిలియన్‌ టన్నుల మేర నాణ్యమైన 65 ప్లస్‌ గ్రేడ్‌, 1.5 మిలియన్‌ టన్నుల మేర 52 ప్లస్‌ గ్రేడ్‌ ఉంటుందని భావిస్తున్నారు.

కనీస ధర టన్నుకు రూ.200

మార్కెట్‌లో ఇనుప ఖనిజం ధర టన్ను రూ.4 వేలు ఉండగా, అందులో 5 శాతం మేర టన్నుకు రూ.200 ఏపీఎండీసీకి చెల్లించాల్సిన కనీస ధరగా పేర్కొన్నారు. గనులశాఖకు చెల్లించాల్సిన రాయల్టీ, డీఎంఎఫ్‌, మెరిట్‌ తదితరాలు అదనమని పేర్కొంటున్నారు. మరోవైపు లీజు మాత్రమే ఏపీఎండీసీది అని, తవ్వకాలకు అవసరమైన అటవీ, పర్యావరణ, ఐబీఎం.. ఇతర అనుమతులు అన్నీ టెండరు దక్కించుకున్న సంస్థే చూసుకునేలా నిబంధన విధించారు.

  • ఓబుళాపురం, హెచ్‌.సిద్ధాపురం, మలపనగుడి పరిధిలో గతంలో 6 లీజులు ఉండగా.. వీటిలోని కొన్ని లీజుల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరుగుతోంది. దీంతో దాదాపు పదేళ్లకుపైగా అక్కడ తవ్వకాలు నిలిచిపోయాయి.

ఇదీ చదవండి: అందుకే పొరుగు రాష్ట్రాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవట్లేదు: జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.