అనంతపురం జిల్లా యాడికి మండలం రాయల చెరువు గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య అనే వ్యక్తికి చెందిన లారీ డిసెంబర్ 31న చోరీకి గురైంది. పెట్రోల్ బంకులో ఆపి ఉన్న లారీని గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా లారీ తెలంగాణలోని వనపర్తిలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే లారీతో పాటు నిందితుడు గంగాధర్‌రావును అదుపులోకి తీసుకున్నారు.
జల్సాలకు అలవాటుపడే
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన గంగాధర్‌రావు ఎంబీఏ పూర్తి చేశాడు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 22 లారీలు, 6 డీసీఎం వాహనాలు దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ దొంగిలించిన వాహనాల నెంబర్లు మార్చి, నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి... హైదరాబాద్‌లో అమ్మేవాడు. కేసు నమోదైన 12 గంటల్లోనే... చేధించిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
ఇవీ చూడండి: