సెల్ ఫోన్ ద్వారా యువతులు, మహిళలను టార్గెట్ చేసి లైంగిక కోరికలు తీర్చుకుంటున్న అనంతపురం జిల్లాకు చెందిన మున్సిపల్ ఉద్యోగిని దిశ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు దిశ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో వర్క్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న మాధవ రెడ్డి (59) మాయమాటలతో యువతులు, మహిళలను పరిచయం చేసుకుంటాడు. వారి అవసరాలను అవకాశంగా తీసుకుని వారికి దగ్గరవుతాడు. తన ఫోన్ నంబర్ వారికి ఇచ్చి.. ఏదైనా అవసరం వస్తే ఫోన్ చేయమని చెప్తాడు. ఆ తర్వాత యువతులు, మహిళలు తనకు ఫోన్ చేస్తే మాటలు కలిపి జీవితాలను నాశనం చేసే స్థాయికి వస్తాడు. శారీరకంగా తాను వాడుకోవడమే కాకుండా.. బ్రోకర్‌గా వ్యవహరించి తనకు పరిచయం ఉన్న వ్యక్తులకు వారిని పరిచయం చేసి ముగ్గులోకి దింపుతాడు. ఇలా చాలా మంది యువతులు, మహిళల జీవితాలను మోసం చేసినట్లు విచారణలో తెలింది. 2008 సంవత్సరంలో ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ లాడ్జిలో ఇద్దరు మహిళలతో వ్యభిచార కేసులో ముద్దాయిగా ఉన్నాడు. విధినిర్వహణలో తప్పిదాలు చేసిన విషయంలోనూ మున్సిపల్ కార్పొరేషన్ లో రెండుసార్లు సస్పెన్షన్‌కు గురయ్యాడు.
ఇలా దొరికాడు..
2021 నవంబర్ (ఈ నెలలో) నెలలో రిటైర్మెంట్ కావాల్సిన వయసులో కూడా అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. గతంలో చేసిన విధంగానే ఒక యువతికి తన ద్విచక్ర వాహనంపై లిఫ్ట్ ఇస్తానని చెప్పి నమ్మించి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బలవంతం చేయబోయాడు. దీనిని వ్యతిరేకించిన యువతి.. దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దిశ పోలీసులు.. మాధవ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా గతంలో ఉన్న కేసులు ఇతని వ్యవహార శైలి యువతులను మహిళలను మోసం చేసిన అంశాలు వెలుగు చూసినట్లు డీఎస్పీ తెలిపారు. ఇతనికి కోర్టు 15 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు తెలిపారు. మాధవ రెడ్డి విషయంలో బాధితులు ఎవరైనా ఉంటే తనను సంప్రదించాలని డీఎస్పీ కోరారు. మాయమాటలు చెప్పి వంచించే వ్యక్తులతో యువతులు, మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సంఘటనలు వారి దృష్టికి వస్తే 9491308867 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
ఇదీ చదవండి: