తమ పాఠశాలకు విశాలమైన క్రీడా మైదానం ఏర్పాటు చేస్తే క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రతిభ చాటుతామంటున్నారు విద్యార్థులు. అనంతపురం జిల్లా పెనుకొండ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన బాలికలు ఇప్పటికే పలు అంతర్జాతీయ క్రీడల్లో మెరిశారు. ఈ దిశగా మండలానికి ఆరు ప్రతిభా అవార్డులు ప్రకటించగా.... ఇందులో ఐదు పురస్కారాలు ఈ పాఠశాలకే రావడం విశేషం.
విద్యలోనే కాకుండా ఇక్కడ విద్యార్ధులు క్రీడల్లోనూ సత్తా చాటుతుండడం ఇతర పాఠశాలల విద్యార్థినులకు ఆదర్శంగా నిలుస్తోంది. పెనుగొండ నియోజకవర్గ స్థాయిలో జరిగిన 8 పోటీలకు గాను... అన్ని విభాగాల్లో ప్రతిభ చాటారు. అనంతపురం ఆర్డీటీ క్రీడా మైదానంలో జరిగిన మినీ గోల్ఫ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన పాఠశాల విద్యార్థులు మహాలక్ష్మి, పల్లవి ఈ నెల 24న మహారాష్ట్రలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇరుకైన క్రీడామైదానం ఉన్నా ఇన్ని విజయాలు సాధించిన విద్యార్థులు విశాలమైన క్రీడామైదానం కల్పించాలని కోరుకుంటున్నారు. ఆ సౌకర్యం వస్తే.. మరింతగా క్రీడల్లో రాణిస్తామంటున్నారు.
ఇవీ చూడండి: