ETV Bharat / state

పూలు వికసిస్తున్నా.. పరిమళించని రైతు బతుకు..!

సాగుమడిలో పూలు సమృద్దిగా వికసిస్తున్నాయి.. ఇంతి కొప్పులో, ఇంటి గడపలో సువాసనలు గభాళిస్తున్నాయి.. కానీ, వాటిని పండించిన రైతు బతుకు మాత్రం.. పరిమళించట్లేదు!! ధర లేక సాగుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. దసరా, దీపావళి పండుగలు కూడా వారి ఆశలపై నీళ్లు చల్లాయి..

ananthapuram-flower-farmers-facing-problems-with-low-price-of-flowers
ధరలు లేక వెలవెలబోతున్న పూలరైతులు
author img

By

Published : Nov 3, 2021, 12:14 PM IST

శ్రావణ మాసం నుంచి మొదలయ్యే పండగల వేళ.. ఉద్యాన పంటల ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది. పండగ రోజులు, శుభకార్యాలను దృష్టిలో పెట్టుకొని పండ్లు, పూలు దిగుబడులు సాధించేలా రైతులు ప్రణాళిక చేసుకుంటారు. అయితే.. కారోనా కాటు నుంచి ఇంకా కోలుకోని ప్రజలు పండగలు చేసుకోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ఇవాళ నరకచతుర్దశి. అయినా.. అనంతపురం జిల్లాలో ఎక్కడా పండగ శోభ కనిపించటంలేదు. గృహాలకు పూల మాలల అలంకరణలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కరోనా లాక్డౌన్ సమయంలో ఆర్థికంగా దెబ్బతిన్న కుటుంబాలు దీపావళి జరుపుకోటానికి పెద్దగా ఆసక్తి చూపటంలేదు. దీంతో పూలకు డిమాండ్ బాగా తగ్గింది. దీంతో.. పూల ధరలు బాగా ఉంటాయని భావించి చామంతులు సాగుచేసిన రైతులు.. కోత కూలి కూడా దక్కక అల్లాడిపోతున్నారు.

దసరా నవరాత్రులకు గాని, దీపావళికి గాని మంచి రేట్లొస్తాయని ఈ పూలు సాగు చేసినాము. కానీ.. నవరాత్రులప్పుడు 20, 30 రూపాయలకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువకు పోలేవు. దీపావళికి కూడా ధరలు ఏ మాత్రం పెరగలేదు. ఈ సారి చానా నష్టపోయాం. ఎకరాకు లక్షా యాభై వేల వరకు పెట్టినం. పూలు అమ్ముకునేందుకు తీసుకెళ్తే... వచ్చే డబ్బులన్నీ కోత కూలీలకు, ట్రాన్స్​పోర్ట్​కే సరిపోవడం లేదు. పెట్టుబడి డబ్బులు కూడా రావట్లేదు ఈ సారి. - అనిల్, చామంతి పూల రైతు

జిల్లాలో 3వేల 724 హెక్టార్లలో రైతులు పూల సాగుచేస్తున్నారు. దీనిలో సింహభాగం చామంతి సాగు జరుగుతోంది. ఏటా పండగ సీజన్ లో చామంతి పూలు కిలో 200 నుంచి 300 రూపాయల వరకు ధర పలుకుతాయి. ఈసారి మామూలు రోజుల్లో కిలో పదికి కొనే దిక్కు లేకుండా పోయింది. దీపావళి పండగ ఉందని, అదనంగా కూలీలను పెట్టి చామంతులు కోసిన రైతులు మార్కెట్ లో కిలో 30 కి మించి ధర లేకపోవడంతో.. తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గుండుమల్లె, రోజా పూల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. మల్లెలు దీపావళి రోజుల్లో కిలో 400 నుంచి 500 రూపాయలకు విక్రయించే వారు. ఈసారి వాటి ధర 200 లకు మించటంలేదు. రోజా పూల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. కిలో కేవలం 70 నుంచి వంద మాత్రమే ధర పలుకుతోంది. కొవిడ్ తో కొనుగోలు శక్తి తగ్గటం.. కర్ణాటకలో అధిగ పూల దిగుబడి రావటం వల్ల అనంతపురం జిల్లా పూలకు ధర రావటంలేదని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.

పెద్దగా నష్టపోతున్నాం. పది, పదైదు పోతుండాయి. రూపాయి రాలేదు. ఈ పొద్దు పోతే ఏమన్న వస్తేనే వచ్చినట్టు. ఇంతవరకూ పావలా రాలా. పెట్టుబడి కూడా రాలే. ఆరెకరాలు పెట్టాను. కనీసం ఆరు లక్షల పైనే అయింది పెట్టుబడి. లక్ష రూపాయలు కుడా రాలేవు. - చామంతి పూల రైతు

అనంతపురం జిల్లాలో సుమారు 3 వేల 500 హెక్టార్లలో పూలసాగు చేపడుతున్నారు. ఇందులో ప్రధానంగా బంతి, చామంతి, కనకాంబరం పూలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు ధరలు లేక రైతులు ఇబ్బందిపడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. పూలసాగు పెరగడం ఒకటి. అదే విధంగా గత నెలలో కురిసిన వర్షాల కారణంగా పూలలో నాణ్యత లోపించింది. అదే పాలీ హౌజ్​లలో పండించిన చామంతులకి రేటుంది కానీ పొలాల్లో పండించిన పంటలకు కొంత ధర తక్కువగా పలుకుతోంది. - సతీష్, ఉద్యానశాఖ ఏడీ

రాయలసీమ జిల్లాల్లో పూల ప్రాసెసింగ్ పరిశ్రమలు లేకపోవటంతో.. రైతులకు ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. భవిష్యత్‌లోనైనా సుగంధ నూనె, రంగులు తయారు చేసే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: Local body elections: స్థానిక సంస్థల ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్‌.. నామినేషన్ల స్వీకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.