పంటల బీమా చెల్లింపులో కొందరికే లబ్ధి కలుగుతోందని అనంతపురం జిల్లా ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల పంజాబ్ తరహాలో రైతులు ఉద్యమం చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీమా పరిహారం కోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారని, ఇప్పటికే అనంతపురం జిల్లాలో అన్నదాతలు నిరసన ప్రదర్శనలు చేశారన్నారు. ఏ రాజకీయ పార్టీల మద్దతు లేకుండా రైతులు స్వచ్ఛందంగా రోడ్డెక్కతున్నారని, ఇకనైనా ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఇదీచదవండి.