ETV Bharat / state

చర్చి గదుల్లో పార్టీ కార్యాలయాలు వద్దు - latest crime news in thadipathri

అనంతపురం జిల్లా మాలమహానాడు అధ్యక్షురాలు కమలమ్మపై తాడిపత్రి పోలీసులు మూడు వేరు వేరు కేసులను నమోదుచేశారు. పట్టణంలోని ఓ ఆర్​సీఎం చర్చిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు విషయంలో ఘర్షణకు పాల్పడటం, కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘన, విలేకరులను దుర్భాషలాడటంపై ఆమెపై కేసులు నమోదు చేసినట్లు సీఐ తేజమూర్తి తెలిపారు.

మాలమహానాడు పార్టీ కార్యాలయం ఏర్పాటు విషయమై ఘర్షణ

author img

By

Published : Jun 19, 2020, 7:04 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని సుంకులమ్మపాలెం కాలనీలోని ఆర్‌సీఎం చర్చి గదుల్లో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు మాలమహానాడు జిల్లా అధ్యక్షురాలు కమలమ్మ ఓ గదిని తీసుకుంటుండగా స్థానిక మహిళలు అభ్యంతరం తెలిపారు. చర్చి వద్ద పార్టీ కార్యకలాపాలు వద్దని ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డారు. తనపై దాడి చేస్తున్నారని పలుమార్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్‌ ఎదుట కమలమ్మ నిరసన చేపట్టారు. ఈ నిరసన చిత్రీకరిస్తున్న విలేకరులను ఆమె దుర్భాషలాడారు. ఘర్షణకు పాల్పడటం, కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘన, విలేకరులను దుర్భాషలాడటంపై కమలమ్మపై మూడు వేరు వేరు కేసులు నమోదు చేసినట్లు సీఐ తేజమూర్తి తెలిపారు.

ఇదీ చూడండి: ఎమ్మెల్యే క్వార్టర్స్​లో పేకాట రాయుళ్ల అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.