అనంతపురం తెలుగుదేశం పార్టీలో విభేదాలు బహిర్గతమయ్యాయి. రైల్వే ఉపరితల వంతెన ప్రారంభించేందుకు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప పోటీపడ్డారు. ఈ అంశంపైనే కొన్ని రోజులుగా వీరి మధ్య వివాదం నడుస్తోంది. అధిష్ఠానం జోక్యం చేసుకుని... అధికారుల సమక్షంలో అందరూ కలిసి ప్రారంభించాలని సూచించింది.
ఈరోజు ప్రారంభోత్సవం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్ అందరూ హాజరయ్యారు. ఎంపీ జేసీ నేరుగా వెళ్లి వంతెన ప్రారంభించారు. అనంతర బ్రిడ్జిపై నడిచి నిర్మాణాన్ని పరిశీలించారు.
ఈ వంతెన రాకుండా ఉండేందుకు కొందరు నేతలు అడ్డుకున్నారనీ... చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారని ఎంపీ ఆరోపించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వంతెన ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.
జేసీ తీరుపై ఎమ్మెల్యే, మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా ఎంపీతో వంతెన ఎలా ప్రారంభిస్తారంటూ అధికారులపై మండిపడ్డారు. తమను పిలవకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి నిలదీశారు.
ఇవీ చదవండి...మా వైఖరిలో మార్పులేదు"