అనంతపురంలో పేదల ఆకలి తీర్చేందుకు రాయల్ మిత్ర బృందం నడుం బిగించింది. వారం రోజులుగా కూరగాయలు, పండ్లను రైతుల నుంచి కొనుగోలు చేసి మురికివాడలు, నగరశివారులోని గ్రామాల్లో పంపిణీ చేస్తున్నారు. కర్బూజా, కళింగర పండ్లతో పాటు ఆరు రకాల కూరగాయలు పేదలకు ఇస్తున్నారు. లాక్డౌన్ నేపధ్యంలో వెలుపలికి రాలేని వారితోపాటు, పేద ప్రజలకు నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు ఇస్తున్నామని షిర్డీ సాయి స్వీట్స్ యజమాని రాయల్ భవానీ చెప్పారు. రైతుల నుంచి నేరుగా కొనటానికి తమ మిత్ర బృందం పదిరోజులుగా గ్రామాల నుంచి ఉద్యాన ఉత్పత్తులను సేకరిస్తోందన్నారు. రైతలను ఆదుకొంటూ, నిరుపేదలకు రోజువారీ అవసరాలు తీరుస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి :