కళ్ల ముందే కష్టార్జితం కనిపిస్తోంది.. ఫలితం దక్కే దారి కనిపించక కన్నీళ్లు వస్తున్నాయి. దాదాపు 2 వేల క్వింటాళ్ల వరకు పొలాల్లో నిల్వలు పేరుకుపోయాయి. కొనేవారు లేరని వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. మార్కెట్లో కిలో రూ.30 ఉన్నప్పటికీ మమ్మల్ని మాత్రం కిలో రూ.8కే వ్యాపారులు అడుగుతున్నారని ఉల్లి రైతులు కన్నీరు పెడుతున్నారు.అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని ఉంతకల్లు గ్రామానికి చెందిన ఖాసీం సాబ్, హాజీసాబ్, నాగేంద్రప్ప , బడే సాబ్, పీరా తదితరులు ఉల్లిసాగు చేశారు. దిగుబడి అమ్ముకోలేక దీనంగా చూస్తున్నారు. ఈ పరిస్థితిపై ఉద్యానశాఖ అధికారి దస్తగిరి దృష్టికి తీసుకెళ్లగా రైతులు ఆత్రుతపడి ఎక్కడి పడితే అక్కడ అమ్ముకోరాదు, మున్ముందు ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. గిడ్డంగుల్లో నిల్వ ఉంచుకోవాలన్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఇదీ చదవండి... నెలాఖరుకు అల్పపీడనం!