శ్రీరామ నవమి సందర్భంగా.. అనంతపురం నగరానికి చెందిన శ్రీనేహ అనే ఎనిమిదో తరగతి బాలిక వినూత్న రీతిలో భక్తిని చాటుకుంది. 3,216 బియ్యపు గింజలపై 'రామ' నామం రాసి, వాటిని సీతారాముల చిత్రపటంపై అతికించింది. రాముడి భక్తుడైన తాత సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆ విద్యార్థిని తెలిపింది.
ఇదీ చదవండి: కరోనా తగ్గాక.. 'వహ్ తాజ్' అనాల్సిందే..
పండుగను పురస్కరించుకుని నగరంలోని శ్రీనివాస్‌నగర్‌లో ఉన్న రామాలయానికి ఈ చిత్రపటాన్ని శ్రీనేహ అందించింది. ప్రతి బియ్యపు గింజపైనా 'రామ' అని రాసినట్లు బాలిక తెలిపింది. దీనిని చూసిన ఆలయ అర్చకులు చిన్నారిని అభినందించారు.
ఇదీ చదవండి: