ETV Bharat / state

'విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఉంచాం' - 'విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఉంచాం'

అనంతపురం ఎస్పీ సత్య ఏసుబాబు గుంతకల్లులో పర్యటించారు. పట్టణంలో లాక్​డౌన్ అమలవుతున్న తీరును స్వయంగా పరిశీలించారు.

anantapuram sp visit gunthakallu
గుంతకల్లులో పర్యటించిన ఎస్పీ సత్య ఏసుబాబు
author img

By

Published : Mar 27, 2020, 5:04 PM IST

గుంతకల్లులో పర్యటించిన ఎస్పీ సత్య ఏసుబాబు

అనంతపురం జిల్లా గుంతకల్లులో లాక్​డౌన్ నిర్వహణను ఎస్పీ సత్య ఏసుబాబు స్వయంగా పరిశీలించారు. రైల్వే కాలనీ, ప్రధాన రహదారులు, చెక్​పోస్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ సత్య ఏసుబాబు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లాక్​డౌన్ అమలవుతున్న నేపథ్యంలో గుంతకల్లును తనిఖీ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు లాక్​డౌన్ ఉల్లంఘించిన 200 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఉదయం 6 గంటల నుంచి, మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఉంచినట్లు వివరించారు. వారంతా ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసు సిబ్బంది పర్యవేక్షిస్తున్నారన్నారు. ప్రజలంతా లాక్​డౌన్​కు సహకరించి, కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సాయపడాలని సూచించారు.

ఇదీ చదవండి: జిల్లాలో వ్యాప్తంగా లాక్ డౌన్... కఠినంగా అమలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.