ETV Bharat / state

నేతలకు 'అనంత' కొత్త పాఠాలు - jagan

అనంతపురం జిల్లాలో ఈ ఎన్నికలు నేతలకు కొత్త అనుభవాన్ని చూపించనున్నాయి. ప్రజామోద కార్యక్రమాలతో... ఆకట్టుకున్న అధికార తెదేపాను ఓటర్లు మళ్లీ ఆశీర్వదిస్తారా లేదా అన్న విషయం కొన్ని గంటల్లో తేలనుంది. ప్రధాన ప్రతిపక్ష హోదాలో వైకాపా పెద్దఎత్తున ఎన్నికల హామీలు ప్రకటించింది. మరోపార్టీ జనసేన కొత్తగా జనక్షేత్రంలోకి వచ్చింది. జనసేన అభ్యర్థులు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు చీల్చారు. అయితే... ఏ పార్టీరి గండిపెట్టారన్నది ఓట్ల లెక్కింపుతో స్పష్టత రానుంది. సుదీర్ఘ రాజకీయం చరిత్ర ఉన్న పరిటాల, జేసీ కుటుంబాల నుంచి వారసులు బరిలోకి దిగారు. వీరు పోటీచేసిన స్థానాల్లో హోరాహోరీ పోరు కొనసాగింది. ఈసారి ఎన్నికల్లో మహిళా ఓటర్లు ఏ పార్టీని ఆశీర్వదిస్తే గెలుపు వారినే వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నేతలకు 'అనంత' కొత్త పాఠాలు
author img

By

Published : May 22, 2019, 5:24 PM IST

నేతలకు 'అనంత' కొత్త పాఠాలు

అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కాకలు తీరిన నేతలు, సుదీర్ఘ రాజకీయ నేపథ్యమున్న కుటుంబాలు పోటీ పడినా... తెదేపానే ఆధిక్యం సాధిస్తూ వచ్చింది. జిల్లాలో 14అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. 32లక్షల 39వేల మంది ఓటర్లుండగా... 26లక్షల 54వేల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2014 ఎన్నికల్లో 80.04 శాతం ఓట్లు పోల్ కాగా... ఈసారి 82.22 శాతం నమోదైంది.

అనంతపురం జిల్లాలో 2009 ఎన్నికల వరకు కాంగ్రెస్ ఆధిపత్యం ఉండేది. కానీ 2014 ఎన్నికల్లో తెదేపా పుంజుకొని 12 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలను కైవశం చేసుకుంది. వైకాపా గెలిచిన 2స్థానాల్లో ఒకటి కదిరి, మరొకటి ఉరవకొండ. అప్పుడు కదిరిలో తెదేపా అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ అతి నమ్మకంతో నిర్లక్ష్యం చేశారని చంద్రబాబు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లోనూ కందికుంట మరోసారి కదిరి నుంచి పోటీలో నిలిచారు. కందికుంట వైకాపా అభ్యర్థి డా.సిద్దారెడ్డిల మధ్య హోరాహోరీ పోటీ సాగిందనే చెప్పవచ్చు. కదిరిలో ముస్లిం మైనార్టీ ఓటర్లు ఏ పార్టీవైపు మొగ్గు చూపుతారో కదిరి వారినే వరించనుంది.

జిల్లాలో మరో కీలక స్థానం రాప్తాడు. పరిటాల కుటుంబానికి తిరుగులేని నియోజకవర్గం. కానీ ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు కొనసాగింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉండే రాప్తాడులో ఇప్పటి వరకు పరిటాల అభ్యర్థినే గెలిపిస్తూ వచ్చారు. వైకాపా అభ్యర్థిగా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. 82.32 శాతం పోలింగ్ నమోదవగా... ఎవరు గెలిచినా మెజారిటీ మాత్రం 5వేల లోపే ఉంటుందనే అంచనా. మరో కీలక నియోజకవర్గం తాడిపత్రి. ఇక్కడ ఇప్పటి వరకు జేసీ సోదరులకు ఓటమి తెలియదు. ఇప్పుడు జేసీ వారసుడు అస్మిత్ రెడ్డి తెదేపా అభ్యర్థిగా పోటీ చేశారు. వైకాపా నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి బరిలో నిలిచారు. వీరిద్దరి మధ్య గట్టి పోరు సాగినప్పటికీ... ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపారనేది తేలనుంది.

హిందూపురం తెదేపాకు కుంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి ఓటమి ఎరగని స్థానం ఇది. 1983 నుంచి తెదేపా అభ్యర్ధినే హిందూపురం ఓటర్లు గెలిపిస్తూ వచ్చారు. నందమూరి బాలకృష్ణ మరోసారి తెదేపా అభ్యర్థిగా బరిలో నిలిచారు. మైనార్టీ ఓటర్లు 40 వేల మంది వరకు ఉన్న హిందూపురంలో... ఈసారి వైకాపా మైనార్టీ నేతనే బరిలో నిలిపింది. విశ్రాంత పోలీస్ అధికారి మహమ్మద్ ఇక్బాల్ వైకాపా నుంచి పోటీ చేశారు. ఇప్పటి వరకు తెదేపాకు ఎదురులేని హిందూపురంలో ఈసారి ఓటర్లు ఏ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదిస్తారో ఓట్ల లెక్కింపుతో తేలనుంది.

శింగనమల అసెంబ్లీ స్థానంలో తెదేపా బండారు శ్రావణిని బరిలో నిలిపింది. గత ఎన్నికల్లో ఓటమిపాలైన వైకాపా అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి ఈసారి శ్రావణితో పోటీ పడ్డారు. ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగగా, జేసీ సోదరులు శ్రావణి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల్లో పనిచేశారు. కళ్యాణదుర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరిని కాదని, ఉమామహేశ్వరనాయుడుకు తెదేపా టికెట్ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచారు. వైకాపా అభ్యర్థి ఉషశ్రీ, తెదేపా అభ్యర్థి ఉమామహేశ్వర నాయుడుల మధ్య గట్టి పోటీ నెలకొనగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీరాపై ప్రజల్లో కొంతమేర ఉన్న సానుభూతి కారణంగా ఓట్లను చీల్చినట్లు తెలుస్తోంది.

జిల్లాలో జనసేన అభ్యర్థులు పెద్దగా ఓట్లు సాధించలేకపోయారనే అంచనా ఉంది. ఒక్క అనంతపురం అసెంబ్లీ స్థానం మినహా ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో పోటీ ఇవ్వలేదు. కానీ గ్లాసు గుర్తుకు పోలైన ఓట్లతో ఏ పార్టీకి నష్టం జరిగిందనేది తేలాలి. ఇక ఎంపీ అభ్యర్థుల విషయంలో ఈసారి వైకాపా అనంతపురం, హిందూపురం రెండు స్థానాలకు బీసీ అభ్యర్థులనే పోటీకి నిలిపింది. హిందూపురం పార్లమెంటు స్థానం పరిధిలో కురబ సామాజిక ఓటర్లు అధికంగా ఉన్నారని భావించిన జగన్ మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్​ను బరిలో నిలిపింది. తెదేపా నుంచి సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్ప రెండుసార్లు గెలుపొంది, మూడోసారి ఎంపీ అభ్యర్థిగా నిలిచారు. వివాదరహితుడని పేరున్న నిమ్మలవైపు మొగ్గుచూపారా... జగన్ బీసీ మంత్రం పనిచేసిందా అనేది తేలాల్సి ఉంది.

అనంతపురం పార్లమెంటు స్థానానికి ఈసారి సిట్టింగ్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ రెడ్డి బరిలో నిలిచారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన జేసీ పవన్ తనదైన శైలిలో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రచారం నిర్వహించారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన గ్రూప్-1 అధికారి తలారి రంగయ్య వైకాపా నుంచి పోటీ చేశారు. పవన్ రెడ్డి, తలారి రంగయ్యల మధ్య జరిగిన పోరులో ఓటరు ఎవరివైపు మొగ్గు చూపారనేది చూడాలి.

అనంతపురం జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో పది స్థానాలు తమవేనంటూ వైకాపా నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా... గత ఎన్నికల్లో దక్కిన 12 సంఖ్య ఏమాత్రం తగ్గదని తెదేపా అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం జరుగుతున్న ఓట్ల లెక్కింపులో వస్తున్న ఫలితాలు నేతలకు కొత్త అనుభావాన్ని నేర్పేలా ఉన్నాయని చెప్పవచ్చు.

ఇదీ చదవండి...

లెక్కింపు ప్రక్రియకు భారీ బందోబస్తు

Intro:ap_vzm_37_21_cmd_sameeksha_avb_c9 ఆంధ్ర ప్రదేశ్ దేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎం డి కె రాజ పాపయ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలోని విద్యుత్ కార్యాలయాన్ని ఏపీ ఈపీడీసీఎల్ సీఎం డి రాజ పాపయ్య సందర్శించారు డివిజన్ లోని విద్యుత్ సరఫరా సిబ్బంది పనితీరు లోవోల్టేజీ సమస్య ట్రాన్స్ఫార్మర్ ఆవశ్యకత తదితర అంశాలపై సమీక్షించారు వేసవిలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉందని ఇబ్బందులు రాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు యంత్రాలతోనే శత శాతం రీడింగ్ నమోదు జరిగేలా నా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు అందుకు సంబంధించిన నా మిషన్లను అందజేయనున్నట్లు వివరించారు ట్రాన్స్ఫార్మర్ లవ్ ఫెయిల్యూర్ ఎక్కువగా ఉన్నాయని అందుకు గల కారణాలను విశ్లేషించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు డివిజన్లో లో సోలార్ పంపుసెట్లు 84 వరకు ఇవ్వాల్సి ఉందని వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అదనపు విద్యుత్ వినియోగంపై దృష్టి పెట్టి ఇ కేసు నమోదు చేయాలని సూచించారు ఎస్సీ వై విష్ణు డి ఈ ఈ రామకృష్ణ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు

Conclusion:కార్యాలయానికి వస్తున్న సీఎం డి రాజ పాపయ్య అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం విద్యుత్ కార్యాలయం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.