అనంతపురం జిల్లా హిందూపురం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం ఆసక్తికరంగా కొనసాగింది. పురపాలక సంఘంలో పనిచేసే ఉద్యోగి అసిస్టెంట్ సిటీ ప్లానర్‌పై వైకాపా కౌన్సిలర్లు అవినీతి ఆరోపణలు చేశారు. సచివాలయ సిబ్బందిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
అసిస్టెంట్ సిటీప్లానర్‌పై అవినీతి ఆరోపణలు నిరూపణ కాకపోతే తన కౌన్సిల్ పదవికి రాజీనామా చేస్తానని కౌన్సిల్ సమావేశంలో 33వ వార్డు కౌన్సిలర్ శివ అన్నారు. అంతేకాకుండా పట్టణంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే అక్రమ ఇసుక రవాణా అరికట్టాలని వైకాపా కౌన్సిలర్లు వైస్ ఛైర్మన్లు కలసి ఛైర్‌పర్సన్‌కు వినతి పత్రాన్ని అందించారు.
ఇదీ చదవండి: Ward members meeting : రసాభాసగా వార్డు సభ్యుల సమావేశం.. నేలపై కూర్చుని నిరసన