ఈబిడ్ సంస్థ కేసులో ప్రధాన నిందితుడైన కడియాల సునీల్ ను నాగపూర్ సబ్ జైలు నుంచి పి.టి వారెంట్ పై సీఐడీ అధికారులు అనంతపురానికి తీసుకొచ్చారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ముందు సునీల్ ను ప్రవేశ పెట్టారు. ఉదయం నుంచి అనంతపురంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణ జరిపి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు తీర్పును వెలువరించింది.
రూ. లక్షకు.. రూ. 30 వేలు వడ్డీ ఇస్తానని ఆశచూపి వందలాది మందిని మోసం చేశాడు. ఈ కేసులో 21 వరకు నిందితుడికి అనంతపురం కోర్టు రిమాండ్ విధించగా.. సీఐడీ అధికారులు రిమాండ్ కు తరలించారు. సుమారు రూ. 300 కోట్ల మేర మోసం జరిగినట్లు ఆరోపణలున్నాయి. గత నాలుగు నెలలుగా నిందితుడు సునీల్ అజ్ఞాతంలో ఉన్నాడు.
ఇదీ చదవండి: