కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఫిర్యాదులను స్వీకరించాలని అనంతపురం జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు సిబ్బందికి సూచించారు. నేడు 91 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. బాధితుల సమస్యకు చట్టపరమైన పరిష్కారాలు చూపాలన్నారు.
ఓ యువకుడు వేధింపుల నుంచి కాపాడాలని యువతి చేసిన ఫిర్యాదును ఆయన, దిశ పోలీసులకు అప్పగించారు. వేధింపు చర్యలపై కఠనంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారులందరితో నేరుగా మాట్లాడారు.
ఇదీ చదవండి: