ETV Bharat / state

కాడికి ఉరితాళ్లతో వినూత్న నిరసన

అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ రైతుసంఘం(సీపీఐ అనుబంధం) ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కాడికి ఉరితాళ్లు కట్టి వినూత్నంగా నిరసన తెలిపారు.

author img

By

Published : Aug 5, 2019, 7:33 PM IST

ధర్నా చేస్తున్న రైతులు
ధర్నా చేస్తున్న రైతులు

అనంతపురంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎక్స్​గ్రేషియా చెల్లించాలని కోరుతూ రైతుసంఘం ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ప్రధాన రహదారిపై వినూత్న ప్రదర్శన నిర్వహించారు. కాడికి ఉరితాళ్లు కట్టి... వారే ఉరేసుకుంటున్నట్టు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ... వైకాపా అధికారంలోకి వచ్చి రెండునెలలు కావస్తున్నా రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించిన దాఖలాలు లేవన్నారు. ఆదివారం ఒక్కరోజు జిల్లాలో నలుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, ప్రస్తుత రైతుల దీనావస్థకు ఇది అద్దం పడుతోందని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్​గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి సమస్యలను పరిష్కరిస్తాం... అభివృద్ధి సాధిస్తాం'

Intro:ఎస్సీలకు పట్టాలు ఇవ్వాలని ఎస్సీ రైతులు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలో జరిగిన స్పందన కార్యక్రమానికి హాజరైన జిల్లా పాలనాధికారి , మంత్రి నారాయణ స్వామి లకు వ్యతిరేకంగా దేవర గుడి పల్లె పంచాయతీ ఎస్సీ రైతులు నిరసన తెలిపారు. ఏళ్ల తరబడిగా తన అనుభవంలో ఉన్న భూములకు అధికారులు పెత్తందారులకు పట్టాలు ఇచ్చి తమకు అన్యాయం చేశారని వాపోయారు.

Body:జిల్లా పాలనాధికారి, మంత్రి నారాయణ స్వామి తమకు న్యాయం చేయాలని కోరారు. అధికారులు తమకు న్యాయం చేయకపోతే అమరావతి కి వెళ్లి పోరాటం చేస్తామని ఎస్సీ రైతులు స్పష్టం చేశారు.

Conclusion:స్పందన వేదిక ఎదురుగా బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. మహేంద్ర ఈటివి భారత్ జీడీ నెల్లూరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.