వాతావరణ బీమా జాబితాలో పేర్లు నమోదు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన అనంతపురం జిల్లా రైతులు గ్రామ సచివాలయాల ముందు నిరసన వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం మండలంలోని తిమ్మసముద్రం గ్రామానికి చెందిన రైతులు వాతావరణ బీమాలో తమ పేర్లు లేవని సిబ్బందిని బయటికి పంపి, తాళాలు వేశారు. అలాగే కంబదూరు మండలం కురాకుల పల్లి గ్రామంలోని రైతులకు గ్రామ సచివాలయానికి తాళాలు వేశారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జిల్లా నాయకుడు గోపాల్ నాయకత్వం వహించారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రైతులకు అన్యాయం జరిగిందని అన్నారు. అనంతరం కళ్యాణదుర్గం వ్యవసాయ అధికారి సంఘటనా స్థలానికి వచ్చి వాతావరణ బీమా చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ రైతులు తమ ఆందోళనను కొనసాగించారు. బీమాను కేవలం 5 నుంచి 6 మందికి మాత్రమే ఎలా నమోదు చేశారని గ్రామ రైతులు నిలదీశారు.
జాబితాలో పేర్లు లేవని.. సచివాలయాలకు తాళాలు వేసిన రైతులు - అనంతపురం వార్తలు
వాతావరణ బీమా జాబితాలో తమ పేర్లు నమోదు కాలేదని ఆగ్రహించిన రైతులు గ్రామ సచివాలయాల ముందు ఆందోళన నిర్వహించి, తాళాలు వేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కంబదూరు మండలాల్లోని పలు గ్రామాల్లో జరిగింది. ఈ కార్యక్రమాన్ని సీపీఐ జిల్లా నాయకుడు గోపాల్ ఆధ్వర్యం నిర్వహించారు.
వాతావరణ బీమా జాబితాలో పేర్లు నమోదు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన అనంతపురం జిల్లా రైతులు గ్రామ సచివాలయాల ముందు నిరసన వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం మండలంలోని తిమ్మసముద్రం గ్రామానికి చెందిన రైతులు వాతావరణ బీమాలో తమ పేర్లు లేవని సిబ్బందిని బయటికి పంపి, తాళాలు వేశారు. అలాగే కంబదూరు మండలం కురాకుల పల్లి గ్రామంలోని రైతులకు గ్రామ సచివాలయానికి తాళాలు వేశారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జిల్లా నాయకుడు గోపాల్ నాయకత్వం వహించారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రైతులకు అన్యాయం జరిగిందని అన్నారు. అనంతరం కళ్యాణదుర్గం వ్యవసాయ అధికారి సంఘటనా స్థలానికి వచ్చి వాతావరణ బీమా చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ రైతులు తమ ఆందోళనను కొనసాగించారు. బీమాను కేవలం 5 నుంచి 6 మందికి మాత్రమే ఎలా నమోదు చేశారని గ్రామ రైతులు నిలదీశారు.
ఇదీ చదవండి : 'రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలి'