ETV Bharat / state

హంద్రీనీవా నీటిని కుప్పం తరలిస్తున్నారు - మంత్రి పెద్దిరెడ్డిపై 'అనంత' రైతుల ఆగ్రహం

Anantapur District Farmers Fire on Minister Peddireddy: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల ప్రయోజనాలు, తాగునీటి అవసరాలను ఖాతరు చేయకుండా హంద్రీనీవా నీటిని కుప్పం తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డుచెప్పకపోవడంతోనే జిల్లా ఇంఛార్జ్‌గా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి నీటిని చిత్తూరు జిల్లాకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

farmers_fire_minister_pedda_reddy
farmers_fire_minister_pedda_reddy
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 2:52 PM IST

Updated : Dec 16, 2023, 3:27 PM IST

Anantapur District Farmers Fire on Minister Peddireddy: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల ప్రయోజనాలు, తాగునీటి అవసరాలను ఖాతరు చేయకుండా, హంద్రీనీవా నీటిని కుప్పం తరలించేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డుచెప్పకపోవడంతోనే జిల్లా ఇంఛార్జ్‌గా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి నీటిని తరలిస్తున్నారని విమర్శిస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను నేరుగా కుప్పం తరలిస్తుండటంతో శ్రీ సత్యసాయి జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుక్కపట్నం చెరువు కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేమన్న అధికారులు మరి, ఆ నీటినే చిత్తూరు జిల్లాకు ఎలా తరలిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి తీరు వల్ల తమకు తీరని అన్యాయం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Farmers Fire on CM Jagan: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆయకట్టు రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఈసారి కూడా మొండిచేయి చూపిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితులను సాకుగా చూపి, ప్రభుత్వ అధికారులు తమకు తీరని అన్యాయం చేస్తూ, హంద్రీనీవా జలాలను కుప్పంకు తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

హంద్రీనీవా నీటిని కుప్పం తరలిస్తున్నారు - మంత్రి పెద్దిరెడ్డిపై 'అనంత' రైతుల ఆగ్రహం

'అనంత' కరవు కష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర - ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంట బీమా ప్రకటించాలని రైతుల డిమాండ్

Farmers Meet Puttaparthi YCP MLA: ఈ ఏడాది శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీనీవా కాలువ ద్వారా ఇప్పటి వరకు 16 టీఎంసీల నీరు కర్నూలు, అనంతపురం జిల్లాలకు చేరింది. అయితే, వాటిలో ఆరు టీఎంసీలు కర్నూలు జిల్లాలోని చెరువులకు మళ్లించారు. మరో ఆరు టీఎంసీలు జీడిపల్లి రిజర్వాయర్‌లో నిల్వ చేశారు. మిగిలిన నీటిని అనంతపురం జిల్లాలోని ఫస్ట్ ఫేస్ కాలువ ద్వారా వినియోగించారు. జీడిపల్లి నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చెరువులకు అరకొరగా నీటిని ఇచ్చిన ప్రభుత్వం, రైతుల కోసం సాగు నీరు విడుదల చేయకుండా నేరుగా కుప్పం తరలిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డిని కలిసి, తమ గోడును వెల్లబోసుకున్న ఎటువంటి ఫలితం రాలేదని వాపోతున్నారు.

Farmers Fire on Minister Peddireddy Behavior: శ్రీ సత్యసాయి జిల్లాలోని బుక్కపట్నం చెరువుకు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. రాయల కాలంలో నిర్మించిన చెరువు ప్రకాశం జిల్లా కంభం, అనంతపురం జిల్లా శింగనమల చెరువుల తరువాత మూడో అతి పెద్ద చెరువుగా గుర్తింపు పొందింది. సుమారు 0.75 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ చెరువు బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి మండలాలను అనుసంధానం చేస్తూ నిర్మించారు. మూడు మండలాలకు తాగునీరు అందించటంతో పాటు అధికారికంగా 3 వేల 200 ఎకరాలకు సాగునీరు అందుతోంది. గత ప్రభుత్వం రైతులకు సకాలంలో నీటిని అందించగా, ఈసారి పంట వేయకుండా రైతులు బీడు పెట్టుకోవాల్సి వచ్చింది. హంద్రీనీవా నీటిని బుక్కపట్నం చెరువుకు తీసుకెళ్లాల్సిన అధికారులు, రైతులను పట్టించుకోకుండా ఆ నీటిని నేరుగా జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి తరలిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.

వర్షాభావం, తెగుళ్లతో మిర్చి రైతుల ఇక్కట్లు - లక్షల్లో నష్టం జరిగినా స్పందించని ప్రభుత్వం

125 Fishermen Families Suffer: మరోవైపు బుక్కపట్నం చెరువుపై ఆధారపడి, సుమారు 125 మత్య్సకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. నిత్యం చేపల వేటతో మత్స్య సంపదను చెన్నైకి ఎగుమతి చేస్తూ, ఆదాయం పొందుతున్నారు. ఇప్పుడు ఈ చెరువుకు రాష్ట్ర ప్రభుత్వం నీరివ్వకపోవడంతో మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఉపాధి కోల్పోవడంతోపాటు ఆర్థికంగా నష్టపోతున్నామని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయ. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బుక్కపట్నం చెరువుకు మరమ్మతులు చేయించి, తొలిసారిగా కృష్ణా జలాలతో నింపారని రైతులు గుర్తు చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లోని చెరువులన్నిటినీ నింపిన తరువాతే, చిత్తూరు జిల్లాకు తరలించేవారు. ఈ సారి బుక్కపట్నం చెరువు కింద ఆయకట్టుకు నీరివ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని రైతులు వాపోతున్నారు.

Chilli Farmers Problems: అందని సాగు నీళ్లు.. పంటకు తెగుళ్లు.. మిర్చి రైతు కన్నీళ్లు

Last Updated : Dec 16, 2023, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.