ETV Bharat / state

'గ్రామసచివాలయ వ్యవస్థతోనే గ్రామ స్వరాజ్యం'

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతోనే సాధ్యం అవుతుందని అనంతపురం జిల్లా కలెక్టర్​ నాగలక్ష్మి సెల్వరాజన్ అన్నారు. వెలిచెలమ, పెద్దన్నవారిపల్లి గ్రామాల్లో రైతు భరోసా చైతన్యయాత్రల్లో ఆమె పాల్గొన్నారు.

anantapur
అనంతపురం జిల్లా కలెక్టర్​ నాగలక్ష్మి సెల్వరాజన్
author img

By

Published : Jul 16, 2021, 1:43 PM IST

గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటుతోనే గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం సాకారమవుతుందని అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ అన్నారు. నంబులపూలకుంట, తలుపుల మండలాల్లోని రైతు భరోసా కేంద్రాలు, గ్రామసచివాలయాలను కలెక్టర్ పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.

అనంతరం వెలిచెలమ, పెద్దన్నవారిపల్లి రైతు భరోసా చైతన్యయాత్రల్లో పాల్గొన్నారు. అన్నదాతలకు అన్నీ సేవలను గ్రామాల్లోనే ఏర్పాటు చేయాలన్న ఆలోచనతోనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భరోసా కేంద్రం ద్వారా అందే సేవలను వివరించి సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన బాధ్యత అధికారులు, సిబ్బందిపై ఉందన్నారు. రైతులు ఈ సేవలను వినియోగించుకోవడం ద్వారా వ్యయ ప్రయాసలు తగ్గుతాయన్నారు.

సచివాలయం ద్వారా ప్రభుత్వ సేవలన్నీ ప్రజల ముంగిటికే చేరాయన్నారు. రైతు భరోసా చైతన్యయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను కలెక్టర్ పరిశీలించారు. వ్యవసాయ, ఉద్యానశాఖ సహాయకులు రైతుల పంటల వివరాలను ఎప్పటికీ అప్పుడు నమోదు చేయడం ద్వారా వారికి అందాల్సిన సాయం సకాలం అందుతాయని కలెక్టర్ అన్నారు.

ఇదీ చదవండి: కడపలో జోరువాన.. పోటెత్తిన వరద

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.