కరోనా వైరస్ వచ్చిన వారిలో ఆత్మస్థైర్యం నింపడమే లక్ష్యంగా పలు చర్యలు చేపట్టామని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. జె.ఎన్.టి.యూ కళాశాలలోని ఎల్లోరా వసతి గృహంలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ ను ఆయన పరిశీలించారు. పాజిటివ్ వచ్చిన వారితో కలసి కాసేపు గడిపారు. కేర్ సెంటర్ దగ్గర బాధితులు షటిల్ ఆడుతుండగా వీక్షించారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ లో చికిత్స పొందుతున్న రోగుల మానసిక ఉల్లాసం కోసం.. షటిల్, బ్యాడ్ మింటన్ ఇతర ఆటలతో పాటు వారికి ఇష్టమైన మ్యూజిక్ వినే విధంగా మ్యూజిక్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి