గ్రామంలో మంచినీటి సమస్య తీర్చాలని అనంతపురం జిల్లా కుందుర్పి మండలం ఎర్రగుంట గ్రామస్థులు కోరారు. మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామానికి చెందిన పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న మంచినీటి పథకాల ద్వారా రెండు మూడు రోజులకు ఒకసారి వస్తుండడంతో నీరు వచ్చే సమయంలో పలు ఘర్షణలు జరుగుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. అధికారులు, పాలకులు వెంటనే స్పందించి తమ గ్రామానికి మంచినీటి వసతి సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి