కూరగాయల మార్కెట్లోని చావిడి గదిలో గుర్తుతెలియని వృద్ధుడు లుంగీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా, మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండల కేంద్రంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహం వద్దకు చేరుకుని, అతని వివరాల కోసం ఆరా తీయగా.. తెలియరాలేదు. బీడీలకట్ట, అగ్గిపెట్టె, శాలువ లభ్యమయ్యాయి. వృద్ధుడి గురించి తెలిసినట్లయితే పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని ఎస్సై అన్నారు.
ఇదీ చదవండి: