ETV Bharat / state

108, 104 వాహనాలను ప్రారంభించిన మంత్రి శంకర్​నారాయణ - మంత్రి శంకర్ నారాయణ వార్తలు

అనంతపురం జిల్లాకు నూతనంగా కేటాయించిన 108, 104 వాహనాలను... మంత్రి శంకర్​నారాయణ, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక వైద్య పరికరాలను అమర్చిన ఈ వాహనాల్లో రోగులకు అన్ని రకాల సేవలు అందిస్తారని మంత్రి తెలిపారు.

ambulance services are inaugrated by minister shankar narayana in ananthapur
అనంతపురంలో 108, 104 వాహనాలను ప్రారంభించిన మంత్రి శంకర్​నారాయణ
author img

By

Published : Jul 2, 2020, 12:11 PM IST

గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్యసేవలు అందించిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కిందని మంత్రి శంకర్​నారాయణ అన్నారు. అనంతపురం జిల్లాకు నూతనంగా కేటాయించిన 108, 104 వాహనాలను... మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ప్రారంభించారు.

అత్యవసర వైద్యం అవసరమైన వారు 108 కి ఫోన్ చేసిన పదిహేను నిమిషాల్లోనే... రోగి ఇంటి వద్దకు చేరుకునేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. సీఎం జగన్ ప్రజల ఆరోగ్యం విషయంలో అనేక సంస్కరణలు చేస్తున్నారని కొనియాడారు.

గతంలో జిల్లా అంతటా 104 వాహనాలు ఐదు మాత్రమే ఉండగా, తమ ముఖ్యమంత్రి మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేశారన్నారు. 104 సంచార వైద్య సేవల వాహనం ద్వారా వైద్యుడు, సిబ్బందితో ప్రతిరోజూ ఒక గ్రామంలో సేవలందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. అత్యాధునిక సాంకేతిక వైద్య పరికరాలను అమర్చిన ఈ వాహనాల్లో రోగులకు అన్ని రకాల సేవలు అందిస్తారని మంత్రి తెలిపారు. జిల్లాకు నూతనంగా 38... 108 సేవల వాహనాలు, 60...104 సేవల వాహనాలు కేటాయించారు.

ఇదీ చదవండి:

బండరాయితో మోది... వ్యక్తి హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.