ప్రభుత్వ తీరుకు నిరసనగా వెనక్కు నడుస్తూ ఆందోళన - ఐకాస సభ్యుల వినూత్న ప్రదర్శన వార్తలు
అమరావతి విషయంలో సీఎం జగన్ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ... అనంతపురంలో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి పాలనను వ్యతిరేకిస్తూ 42వ జాతీయ రహదారిపై వెనక్కి నడుచారు. 57 రోజులుగా రాజధాని కోసం ఆందోళనలు జరుగుతున్నా... ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసే విషయంలో ఏపీ సర్కార్ రివర్స్‌గా పయనిస్తోందని విమర్శించారు.