ETV Bharat / state

ఖమ్మం నగరంలో టీడీపీ సభ.. ఎటుచూసినా పసుపు శోభ - Telugu Desam Sankharavam Khammam

TDP Public Meeting in Khammam:తెలంగాణలోని ఖమ్మంలో జరిగే టీడీపీ సమర శంఖారావం సభకు సర్దార్ పటేల్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఖమ్మం దారులన్నీ పసుపు తోరణాలతో శోభాయమానంగా కనువిందు చేస్తున్నాయి. సాయంత్రం జరగబోయే సభకు సుమారు లక్ష మంది వరకు వస్తారని అంచనా. టీడీపీ బ్యానర్లు, ఫ్లెక్సీలు, చంద్రబాబు కటౌట్లతో నగర రహదారులన్ని కళకళలాడుతున్నాయి.

TDP Public Meeting in Khammam
TDP Public Meeting in Khammam
author img

By

Published : Dec 21, 2022, 3:42 PM IST

TDP Public Meeting in Khammam: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పసుపు జెండాలు రెపరెపలాడుతున్నాయి. తెలుగుదేశం శంఖారావం బహిరంగ సభకు ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియం ముస్తాబయింది. సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబు పాల్గొనే బహిరంగసభ కోసం కార్యకర్తలు, శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పార్టీకి గత వైభవం తీసుకొచ్చేలా.. 25 నియోజకవర్గాల నుంచి దాదాపు లక్షమందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు సభతో మరోసారి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ఖమ్మం నగరానికి కార్యకర్తలు తరలివస్తుండగా.. ఈ సభ అనంతరం తెలంగాణలో తెలుగుదేశం బలోపేతం అవుతోందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం నగరంలో టీడీపీ సభ.. ఎటుచూసినా పసుపు శోభ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.