ETV Bharat / state

మూడు శతాబ్దాలుగా ఆ గ్రామంలో మద్యపాన నిషేధం - adiguppa village latest news

మన దేశంలో మంచి నీరు దొరకని గ్రామాలు ఉన్నాయి కాని.. మద్యం దొరకని గ్రామాలు మాత్రం ఉండవనటం అతిశయోక్తి కాదు. ఇందుకు భిన్నంగా... మద్యాన్ని తమ ఊరి పొలిమేరను కూడా తాకనివ్వటం లేదు అనంతపురం జిల్లాలోని ఓ గ్రామస్థులు. అలాగే ఆ ఊరిలో కోడిమాంసం తినటం కూడా నిషేధం. అంతేందుకు కనీసం కోడి గుడ్డు కూడా ఆ ఊరిలో కనిపించదు. మధ్యాహ్న భోజన పథకంలోనూ ఈ గ్రామంలోని పిల్లలకు కోడి గుడ్డు వడ్డించరు. ఇంతకీ ఆ గ్రామస్థులు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?... దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి?.. ఈ ప్రశ్నలకు సమాధానం పూర్తి కథనంలో...

adiguppa village
adiguppa village
author img

By

Published : Oct 10, 2020, 9:10 AM IST

మూడు శతాబ్దాలుగా ఆ గ్రామంలో మద్యపాన నిషేధం

అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం అడిగుప్ప గ్రామంలోని ఓ సంప్రదాయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుత సమాజంలో ఏ గ్రామంలో చూసినా మద్యం కనిపిస్తుంది. ఈ ఊరిలో మాత్రం ఆ ఊసే ఉండదు. సుమారు మూడు వందల ఏళ్లుగా ఇక్కడ మద్య నిషేధం అమల్లో ఉంది. అంతేకాదు ఇక్కడివారు కోడి మాంసం, కోడి గుడ్డు కూడా తినరు. వీరు ఇంత కఠిన సంప్రదాయం పాటించడం వెనుక ఓ చరిత్ర ఉంది.

అప్పటి నుంచి నిషేధం

సుమారు 3 శతాబ్దాల ఈ ప్రాంతాన్ని పాలించే సామంతరాజు కోట విడిచి విహారయాత్రకు వెళ్లాడు. అదే సమయంలో చిత్రదుర్గానికి చెందిన రాజు ఇక్కడున్న సంపదను దోచుకునేందుకు వ్యూహం పన్నాడు. ఇక్కడున్న ప్రజలకు మద్యం, కోడి మాంసం తినిపించాడు. అంతా మత్తులోకి జారుకున్నాక సొమ్ము దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాజు... తిరిగి వచ్చి వారితో పోరాడి విజయం సాధిస్తాడు. శత్రువులు ఇంత సాహసానికి ప్రయత్నించడానికి కారణం మద్యం, మాంసం అని గుర్తించిన ఆయన...ఇకనుంచి వీటిని తాకమని ప్రమాణం చేయించాడట. ఇక అప్పటినుంచి నేటి వరకు గ్రామంలో మద్యం, కోడిమాంసం నిషేధం. గ్రామస్థులు ఎవరూ ఈ నిబంధనను అతిక్రమించరు. బయటివారు వచ్చినా.. దీనికి కట్టుబడి ఉండాల్సిందే.

శాంతి మార్గంలో

ఈ వింత నిబంధనే...గ్రామస్థులను క్రమశిక్షణ, ప్రశాంతత వైపు నడిపించింది. రాయదుర్గానికి 10కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అడిగుప్పలో సుమారు 6 వందల మంది నివసిస్తున్నారు. ఇక్కడున్న వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావటం మరో విశేషం. ఏ విషయంలోనైనా వీరంతా సంఘటితంగా ఉంటారు. అంతేకాదు పగలు, ప్రతీకారాలు ఇక్కడ అసలు కనిపించవు. ఎవరి మధ్య అయినా విభేదాలు వస్తే... గ్రామ పెద్దల సమక్షంలోనే పరిష్కరించుకుంటారు.

పాఠశాలలో గుడ్డు మాయం

పెద్దల బాటలోనే చిన్నపిల్లలు సైతం నడుస్తున్నారు. గ్రామ కట్టుబాట్ల ప్రకారం స్థానిక ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో గుడ్డు లేకుండా చేశారు. విద్యార్థులందరూ గుడ్డు వద్దని చెప్పటంతో ఉపాధ్యాయులు కూడా దానికే కట్టుబడి ఉన్నారు. ప్రతి చిన్న విషయానికి గొడవలు పడుతూ... నిత్యం ఆధిపత్యం కోసం పాకులాడుతున్న పరిస్థితులు ఉన్న నేటి రోజుల్లో ఇలా గ్రామంలోని ప్రజలంతా ఐకమత్యంగా ఉండటం విశేషం. మూడు శతాబ్దాల పాటు ఒక మాటకు కట్టుబడి ఉండడాన్ని అభినందిస్తున్నారు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.