అనంతపురం జిల్లాలో..
ఉరవకొండ మండలం చిన్న ముష్టురు క్రాస్ వద్ద ఆటోలో అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారినుంచి దాదాపు 1000 మద్యం టెట్రా ప్రాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
కదిరి నియోజకవర్గంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తీసుకువస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 192 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి తండాలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సారా తయారీకి ఉపయోగించే సామగ్రిని ధ్వంసం చేశారు. పోలీసులు రాకను గమనించిన సారా తయారీ దారులు పరారయ్యారు.
కృష్ణా జిల్లాలో..
పెనుమాకలంకలో కొల్లేరులో నాటు సారా తయారు చేస్తున్న బట్టీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి 25 లీటర్ల నాటుసారా, తయారీ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు మండవల్లి ఎస్సై తెలిపారు.
విశాఖ జిల్లాలో...
మాకవరపాలెం మండలం రాచపల్లి వద్ద పశువులపాకలో అక్రమంగా నిలువ ఉంచిన 290 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్న తరుణంలో మద్యాన్ని అక్రమంగా నిలువ ఉంచినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ కరక రాము సారధ్యంలో విస్తృతంగా సోదాలు నిర్వహించి పశువులపాకలో నిల్వ ఉంచిన మద్యాన్ని పట్టుకున్నారు.
ఇదీ చదవండి: