ETV Bharat / state

Agri Hubs: కొరవడిన ముందు చూపు..నిరుపయోగంగా రైతు భరోసా కేంద్రాల హబ్​లు - నిరుపయోగంగా రైతు భరోసా కేంద్రాల హబ్​లు

అనంతపురం జిల్లాలో రైతు భరోసా కేంద్రాల హబ్​లు నిరుపయోగంగా మారాయి. రైతుల ఉత్పత్తులను నిల్వ చేసుకోటానికి మార్కెట్ యార్డు ఆవరణలో నిర్మించిన గోదాములను ఆర్బీకేల హబ్​ల కోసం ఆగ్రోస్​కు అద్దెకిచ్చారు. ఆర్బీకేలు ఏర్పాటైన రెండో ఏడాది ఈ విధానం పూర్తిగా మార్పు చేశారు. గ్రామంలోనే ఆర్బీకేకు అనుబంధంగా గోదాము నిర్మించి అక్కడే అన్ని ఉత్పాదకాలు నిల్వ చేయాలని నిర్ణయించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 11 చోట్ల అద్దెకు తీసుకున్న గోదాములు ఖాళీగా ఉన్నాయి.

కొరవడిన ముందు చూపు
కొరవడిన ముందు చూపు
author img

By

Published : Nov 2, 2021, 9:56 PM IST

అనంతపురం జిల్లాలో రైతు భరోసా కేంద్రాల హబ్​లు నిరుపయోగంగా మారాయి. గ్రామాల్లోని ఆర్బీకేలకు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు సరఫరా చేయటానికి డివిజన్​లో ఒకటి చొప్పున గోదాములను అద్దెకు తీసుకొని హబ్​లుగా ఏర్పాటు చేశారు. మార్కెటింగ్ శాఖ రైతుల కోసం నిర్మించిన గోదాములను హబ్​ల కోసం ఏపీ ఆగ్రోస్ సంస్థకు అద్దెకు ఇచ్చింది. ఏపీ ఆగ్రోస్ తొలుత ఐదు గోదాములు అద్దెకు తీసుకొని, 11 నెలలకు అద్దె ఒప్పందం చేసుకుంది. ఈ హబ్​లు చాలవని వ్యవసాయ శాఖ మరో ఆరు గోదాములు తీసుకుంది.

మూడు నెలలు మాత్రం ఆగ్రోస్ సంస్థ కొంతమేర ఎరువులు నిల్వచేసి ఆర్బీకేలకు సరఫరా చేసింది. రైతులు ఆర్డర్ చేసిన వారం రోజులకు కూడా ఎరువులు, పురుగు మందులు ఇవ్వలేకపోయారు. దీంతో ఈ వ్యవస్థ విఫలమైనట్లు భావించిన వ్యవసాయశాఖ.. ఎరువుల సరఫరా బాధ్యతను ఆగ్రోస్ నుంచి మార్క్​ఫెడ్​కు అప్పగించింది. ఈ సంస్థకు అనంతపురం జిల్లా కేంద్రంలో స్వంత గోదాములు ఉండటంతో హబ్​లో నిల్వచేసే అవసరం లేకుండా పోయింది. ఈ 11 హబ్​లతో తమకు అవసరం లేదని, రైతులకు గ్రామాల్లో అడిగిన వెంటనే ఎరువులు, పురుగు మందులు ఇచ్చేలా ఎక్కడికక్కడ ఆర్బీకేల్లోనే నిల్వ చేస్తున్నట్లు మార్క్​ఫెడ్ అధికారులు చెబుతున్నారు.

వ్యవసాయ డివిజన్​లోని గోదాముల నిర్వహణ కోసం 11 మంది వ్యవసాయ అధికారులు, వారికి సహాయకులుగా మరో 11 మందిని నియమించారు. ఎరువుల సరఫరా విధానంలో మార్పు రావటంతో 22 మందికి ఆరు నెలల నుంచి ఎలాంటి పని లేదు. మరోవైపు మార్కెట్ యార్డు ఆవరణలో ఉన్న ఈ గోదాములను వ్యవసాయశాఖ తిరిగి వెనక్కి అప్పగించకపోవటం వల్ల రైతుల ఉత్పత్తుల నిల్వకు కూడా ఇబ్బందిగా మారింది. ఇప్పటికే మార్కెటింగ్ శాఖకు ఆగ్రోస్ సంస్థ 30 లక్షలకు పైగా అద్దె బకాయి పడింది. తమ బకాయి చెల్లించాలని మార్కెటింగ్ శాఖ అధికారులు రాస్తున్న లేఖలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అద్దె బకాయి ఉందని, హబ్​లు, వాటిలో అధికారులకు పనిలేకపోవటం వాస్తమేనని ఆగ్రోస్ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: Mahapadayathra: రెండోరోజు మహాపాదయాత్ర.. కదం కలిపి కదిలిన రైతులు..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.