ETV Bharat / state

ప్రధానోపాధ్యాయుడికి వ్యతిరేకంగా ఆందోళన....

Anantapur: విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాల్సిన ప్రధానోపాధ్యాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రధానోపాధ్యాయుడు బషీర్ అహ్మద్​పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం ఆందోళన చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా టి.వీరాపురం గ్రామంలో చోటుచేసుకుంది.

Bashir Ahmed
బషీర్ అహ్మద్
author img

By

Published : Nov 4, 2022, 10:15 PM IST

Anantapur: అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం టి.వీరాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రధానోపాధ్యాయుడు బషీర్ అహ్మద్​పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం ఆందోళన చేశారు. ప్రధానోపాధ్యాయుడు బషీర్ అహ్మద్ విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన దిగారు.

నిలదీసిన విద్యార్థుల తల్లిదండ్రులు.. తోటి ఉపాధ్యాయులతో పాటు పాఠశాలలోనే మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు పట్ల కూడా అనుచితంగా వ్యవహరిస్తున్నాడని, అకారణంగా దుర్భాషలాడుతున్నాడని గ్రామస్తులు మండిపడుతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని అక్కడి నుంచి బదిలీ చేయాలని గతంలో కూడా పలుమార్లు ఆందోళనలు, ధర్నాలు చేసినా ఫలితం లేదని గ్రామస్తులు అంటున్నారు. ప్రధానోపాధ్యాయునిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా విద్యాశాఖ అధికారులు వ్యవహరించడం సరికాదని అంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.