తెలంగాణలోని పట్టణ ప్రగతిలో విషాదం చోటు చేసుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ రోడ్‌లోని హనుమాన్‌నగర్‌లో జేసీబీతో మురికి కాలువలు శుభ్రం చేస్తుండగా పక్కనే ఉన్న గోడ కూలింది. ఈ ప్రమాదంలో ప్రిన్సి అనే చిన్నారి అక్కడిక్కడే మృతి చెందగా.. పాప తమ్ముడు తీవ్రంగా గాయపడ్డాడు. బాబును ఎంజీఎం ఆస్పపతి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ అజాగ్రత్తగా జేసీబీ నడపడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతరాలి తండ్రి సాంబశివరావు వండ్రంగి పని చేస్తూ స్థానికంగా అద్దెకు ఉంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: దిల్లీ పాఠశాలలకు సెలవుల పొడిగింపు- పరీక్షలు వాయిదా