అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం వేపరాల సమీపంలో కారు - ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నంబులపూలకుంట మండలం ఎదురు తండాకు చెందిన అనిల్ కుమార్, కార్తీక్ కదిరి నుంచి స్వగ్రామానికి బయలుదేరారు.
అదే సమయంలో రాయచోటి నుంచి కదిరికి వస్తున్న కారు వేపరాల వద్ద ఢీ కొంది. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానికులు గాయపడిన అనిల్ కుమార్, కార్తీక్ లను చికిత్స నిమిత్తం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.
ఇదీ చదవండి:
RaghuRama letter to Jagan: సీఎంకు ఏడో లేఖ రాసిన ఎంపీ రఘురామ!